Bhagwant Mann : సిద్ధూ హత్య కేసు : దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదు : పంజాబ్ సీఎం
Bhagwant Mann : పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు సీఎం భగవంత్ సింగ్ మాన్.;
Bhagwant Mann : పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించారు సీఎం భగవంత్ సింగ్ మాన్. సెక్యూరిటీ తగ్గించే విషయంలో ఏం జరిగిందే దానిపైనా సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. ఈ కేసులో దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదన్నారు. VIP కల్చర్‌కు చెక్ పెట్టే క్రమంలో భధ్రత కుదింపు విషయంపై ఏం జరిగింది అనే దానిపై నివేదిక ఇవ్వాలని DGPని కూడా ఆదేశించారు. తమ కుమారుడి హత్యపై CBI లేదా NIA దర్యాప్తు జరిపించాలంటూ సిద్ధూ తండ్రి ఇప్పటికే CMకు లేఖ రాశారు. అటు.. ఇది రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాల వల్ల జరిగిన హత్యగానే పోలీసులు చెప్తున్నారు. ఈ తీరు పట్ల పంజాబ్ PCC నేతలు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.