'బిగ్‌బాస్'.. కంటెస్టెంట్ల కథ మార్చేసింది.. వరుస ఆఫర్లు..
అపవాదుని మోసినా ఆఖరికి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వేరే టాపిక్ ఏమీ లేదు మాట్లాడుకోవడానికి బిగ్‌బాస్ ఒక్కటే ఉందన్న;
కరోనా సీజన్‌లో మొదలై ప్రేక్షకుల చూపుల్ని తనవైపే తిప్పుకున్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరూ లేరన్న అపవాదుని మోసినా ఆఖరికి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వేరే టాపిక్ ఏమీ లేదు మాట్లాడుకోవడానికి బిగ్‌బాస్ ఒక్కటే ఉందన్న సీన్ క్రియేట్ చేసిన షో ఇది.. ఆఖరికి విన్నర్ ఎవరో అన్న ఆరాటం అందరిలో కలగజేసింది.. అభిజిత్‌కే పట్టం కట్టి విన్నర్‌ని చేసింది.
అయితే షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో బిజినీ చేసింది బిగ్ బాస్. విన్నర్ అభిజిత్‌కి.. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్3 చిత్రంలో అవకాశం వచ్చింది. ఇక సోహైల్‌కి అయితే చెప్పక్కర్లేదు హౌస్ నుంచి బయటకు రాగానే సినిమా ఛాన్స్. అతడి సినిమాలో చిరంజీవి, బ్రహ్మానందం నటిస్తాననడం ఊహించని సోహైల్ ఉబ్బితబ్బిబవుతున్నాడు.
టాప్ ఫైవ్‌లో చోటు సంపాదించుకున్న మోనాల్.. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్‌లో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసింది. మరో అందమైన సొట్ట బుగ్గల సుందరి దివి తన తర్వాతి చిత్రంలో నటించనుందని మెగాస్టార్ స్వయంగా చెప్పారు. ఇక చిరంజీవి తాజా చిత్రం ఆచార్యలో మెహబూబ్‌కు ఓ పాత్ర దక్కిందని తాజా సమాచారం. కంటెస్టెంట్లు వంద రోజుల కష్టం ఫలించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్‌కి ఎప్పటికి రుణ పడి ఉంటామని అంటున్నారు.