ఆయన అలా మాట్లాడడం కరెక్ట్ కాదు.. నా ఎఫర్ట్ నేను పెట్టాను: స్వాతీ దీక్షిత్
నాగార్జున గారు అన్న మరో మాటకు షాక్ అయ్యానని చెప్పింది.;
వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైంది. తనేంటో ప్రేక్షకులు తెలుసుకునేలోపు ఎలిమినేట్ అయి వెళ్లి పోయింది స్వాతీ దీక్షిత్. మొన్న దేవీ నాగవల్లి, నిన్న స్వాతీ దీక్షిత్ ఎలమినేషన్ ఓటింగ్ ప్రకారమే జరిగిందా.. లేక కావాలనే బిగ్‌బాస్ బయటకు పంపిస్తున్నారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా సైతం దేవీ, స్వాతి దీక్షిత్‌ల ఎలిమినేషన్‌ని తప్పుపడుతోంది. ఇదే విషయాన్ని దేవి బయటకు వచ్చినప్పుడు ప్రస్తావించింది. ఇప్పుడు స్వాతి కూడా అదే మాట అంటోంది.
నాగార్జున గారు అన్న మరో మాటకు షాక్ అయ్యానని చెప్పింది. హౌస్‌లో ఆట ఆడేవాళ్లని మాత్రమే ప్రేక్షకులు గెలిపిస్తారు అని హోస్ట్ నాగార్జున గారు అనడం నన్ను బాధించింది. ఇంతకు ముందు ఎవరూ అలా అనలేదు. అసలు నన్ను బిగ్‌బాస్ హౌస్‌కి పంపించడం ఎందుకు.. ఎలిమినేట్ చేయడం ఎందుకు..నేనేం చేయలేదని అనడం ఎందుకు.. నిజంగానే నేను ఏమీ చేయకపోతే నాగార్జున గారు అలా అన్నారంటే అర్థం ఉంటుంది. కానీ నా ఎఫర్ట్ నేను పెట్టాను. కానీ నాగార్జున గారు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయకపోతే స్వాతిని పంపించినట్లు మిమ్మల్ని కూడా పంపించేస్తారు అని హౌస్‌లోని సభ్యులతో అన్నారు.
ఆయన అలా అనడం నాకు నచ్చలేదు. ఆ మాటకు నేను ఒప్పుకోను. నేను ఎంటర్‌టైన్ చేసిన క్లిప్పింగులు ఏవీ చూపించలేదు. మరి ప్రేక్షకులకు ఆ విషయం ఎలా తెలుస్తుంది. నేను చేసిన దాంట్లో కనీసం సగం చూపించినా సంతోషించేదాన్ని. కనీసం 5% కూడా చూపించలేదు. అంతా ఎడిట్ చేసి నేను ఏం చేయలేదని అంటున్నారు. ఎలిమినేట్ అవ్వనని అనుకున్నా. ఆఖరికి నన్నే పంపించేశారు. అందుకే నేనేమీ బాధపడలేదు. వీళ్లే ఏదో చేశారని నాకు తెలుసు అని ఎలమినేట్ అయి బయటకొచ్చిన స్వాతీ దీక్షిత్ చెప్పుకొచ్చింది.