కరోనాను తేలిగ్గా తీసుకోవద్దు: బయోకాన్ కిరణ్ షా
కరోనాను అంత తేలిగ్గా తీసుకోవద్దని.. ఏమాత్రం లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని బయోకాన్ ఈసీ కిరణ్ షా సూచించారు.;
కరోనాను అంత తేలిగ్గా తీసుకోవద్దని.. ఏమాత్రం లక్షణాలు కనిపించినా అప్రమత్తం కావాలని బయోకాన్ ఈసీ కిరణ్ షా సూచించారు. ఆగస్టులో ఆమెకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజలకు సందేశం పంపారు. కరోనా అత్యంత ప్రమాదకరమైనది.. ఈ మహమ్మారి బారినపడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పొరపాటున కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. కరోనా బారినపడిన వారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని.. ప్రతీరోజూ యోగా చేయాలని కిరణ్ షా సూచించారు.