Odisha: ప్రజల పైకి కారు ఎక్కించిన ఎమ్మెల్యే.. !

Odisha: ఖుర్దాలో దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ జగదేవ్ వాహనం ధ్వంసం చేయటమేగాక...ఆయ‌న‌పై దాడి చేశారు.

Update: 2022-03-12 12:52 GMT

Odisha:  దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన యూపీ లఖీంపూర్ ఘటన మరవక ముందే...అచ్చు ఇదే తరహా సంఘటనే ఒడిశాలో జరిగింది. అధికార బీజూ జ‌న‌తాద‌ళ్‌కు చెందిన స‌స్పెండెడ్ ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగదేవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఖుర్దాలో ఎన్నిక‌ల ప్రచారం సంద‌ర్భంగా గుమికూడిన ప్రజలమీదకు... ప్రశాంత్ జగదేవ్‌ కారు దూసుకెళ్లింది. ఈ దర్ఘటనలో 23 మందికి గాయాల‌య్యాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులతోపాటు ఏడుగురు గాయపడ్డారు. కారు ఢీకొట్టిన ఘటన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఖుర్దాలో దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ జగదేవ్ వాహనం ధ్వంసం చేయటమేగాక...ఆయ‌న‌పై దాడి చేశారు. స్థానికుల దాడిలో ప్రశాంత్ జగదేవ్ కు తీవ్రగాయాలయ్యాయి. ఎమ్మెల్యేను సైతం కారు యాక్సిడెంట్‌లో గాయపడి చికిత్సపొందుతున్న ఆస్పత్రికే తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను బీజేడీ నుంచి చెందిన ప్రశాంత్ జగదేవ్‌ను గత ఏడాది సస్పెండ్ చేశారు.

ఖోర్దా జిల్లా బాన్‌పూర్‌లో బ్లాక్ ఛైర్మన్ పదవికి ఎన్నికల నేపథ్యంలో...బ్లాక్ ఆఫీసు వద్ద గుమికూడి ఉన్న ప్రజలపైకి ఒక్కసారిగా ఆయన కారు దూసుకపోయింది. తీవ్రంగా గాయపడిన ఓ మహిళను బాన్ పూర్ లోని ఆసుపత్రికి తరలించగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు బాలుగావ్ SDPO తెలిపారు. 

Tags:    

Similar News