BJP : బీజేపీ పెద్దలతో కిరణ్ కుమార్ రెడ్డి

Update: 2023-04-08 12:52 GMT

ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలోని బీజేపీ పెద్దలను కలిశారు. నిన్న బీజేపీలో చేరాక పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. జేపీ నడ్డా నివాసంలో అమిత్‌షాతో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాజకీయాలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలపై అమిత్‌షా, బీఎల్‌ సంతోష్‌తో మంతనాలు జరిపారు. కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులపై మాజీ సీఎం యడ్యూరప్పతోనూ చర్చించారు కిరణ్‌కుమార్‌రెడ్డి.

Similar News