కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..!
ఇప్పటికే ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేష్ శ్రీవాత్సవ, నవాబ్ గంజ్ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గాంగ్ వార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.;
దేశవ్యాప్తంగా కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వైరస్ బారిన పడి చనిపోతున్న ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతుంది. అందులో భాగంగానే తాజాగా యూపీలో కరోనాతో మరో ఎమ్మెల్యే చనిపోయారు. బీజేపీకి చెందిన సలోన్ ఎమ్మెల్యే దాల్ బహదూర్ ఈ ఉదయం మరణించారు. దీంతో యూపీలో కరోనాతో చనిపోయిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.
ఇప్పటికే ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేష్ శ్రీవాత్సవ, నవాబ్ గంజ్ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గాంగ్ వార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా దాల్ బహదూర్ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీ జిల్లా సలోన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిపై 16 వేల మెజార్టీతో విజయం సాధించారు. బహదూర్ మృతిపట్ల సీఎం యోగి, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.