తాజ్ మహల్ పేరును త్వరలోనే మారుస్తాం : సురేంద్ర సింగ్
ఉత్తరప్రదేశ్ లోని బారియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.;
ఉత్తరప్రదేశ్ లోని బారియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ పేరును త్వరలోనే రామ్ మహల్ లేదా శివ మహల్ గా మారుస్తామని అన్నారు. భారతీయ సంస్కృతిని ముస్లిం పాలకులు నాశనం చేశారని.. ఇప్పుడు వాటిని పునరుద్దించడానికి స్వర్ణశఖం వచ్చిందని అన్నారు. శివాజీ వంశానికి చెందిన సీఎం యోగి ఆదిత్యానాథ్.. తాజ్ పేరును తప్పకుండా పేరును మారుస్తారని అన్నారు.