బెంగాల్ లో బీజేపీకి షాక్..పార్టీని వీడిన ఎంపీ భార్య!

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్(Sujata Mondal Khan) సోమవారం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2020-12-21 10:44 GMT

పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్(Sujata Mondal Khan) సోమవారం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె తృణమూల్ కాంగ్రెస్‌(Trinamool Congress)లో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. బీజేపీలో ఒక మహిళగా తనకి దక్కాల్సిన గౌరవం దక్కలేదని, అందుకే తాను తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినట్టు వెల్లడించారు. అయితే తన భర్త సౌమిత్రా ఖాన్ (Saumitra Khan) కూడా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారా లేదా  అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా , భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని తోసిపుచ్చారు.

ఇదిలావుండగా, రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలవుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం అంచనా వేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ  ఎన్నికల వ్యూహకర్తగా ఆయన పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి దీదీకే పట్టం కడతారని, కనీసం రెండంకెల సీట్లు కూడా కాషాయ పార్టీ గెలుచుకోలేదని పీకే జోస్యం చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ ఇప్పుడున్న దానికంటే ఏ మాత్రం మేరుగుపడిన తన స్థానాన్ని వదులుకుంటానని పీకే సవాల్‌ విసిరారు.

Tags:    

Similar News