పశ్చిమ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీని గెలిపించాలి : అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఐదో దశకు చేరుకున్నాయి. బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తుతోంది. క్రిష్ నానాగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.;
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఐదో దశకు చేరుకున్నాయి. బీజేపీ, టీఎంసీ పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తుతోంది. క్రిష్ నానాగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అమిత్ షా రోడ్‌షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దారి పొడువునా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, అమిత్ షా ఫొటోలు పట్టుకుని నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.