బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఆందోళన

Update: 2020-10-08 12:36 GMT

బెంగాల్‌లో కార్యకర్తలపై దాడులకు నిరసనగా బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించింది. ప్రభుత్వం అవినీతి, గూండా రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. కోల్‌కతాలో "ఛలో సచివాలయం" పేరుతో చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.

సచివాలయం వైపు దూసుకెళ్లిన వేలాది మంది బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. బాష్పవాయువు, జల ఫిరంగుల ప్రయోగించారు. బీజేపీ ఎంపీ జ్యోతిర్మయి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీకి గాయాలయ్యాయి. పోలీసుల లాఠీఛార్జ్‌లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. శానిటైజేషన్‌ కోసం రెండు రోజుల పాటు సచివాలయం మూసివేస్తున్నట్టు మమత సర్కారు ప్రకటించింది.

Tags:    

Similar News