రైతు ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి!

అటు తాము కూడా ఆందోళనల నుంచి తప్పుకుంటున్నట్లుగా బీకేయూ (భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్‌ సింగ్‌ ప్రకటించారు. నిన్నటి ట్రాక్టర్ల పరేడ్‌లో చోటుచేసుకున్న ఘటనలు తీవ్రంగా బాధించాయన్నారు.

Update: 2021-01-27 13:58 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీలో ఆందోళలను చేపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే దేశ రాజధానిలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల తర్వాత రైతు ఉద్యమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టుగా కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌ (ఆర్‌కేఎంఎస్‌) కన్వీనర్‌ సర్దార్‌ వీఎం సింగ్‌ ప్రకటించారు. ఇదే తరహాలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (భాను) కూడా ప్రకటించింది. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయని, ఈ పరిస్థితిల్లో ఆందోళనలు కొనసాగించలేమని వీఎం సింగ్‌ అన్నారు.

అంతేకాకుండా నిన్న ఢిల్లీలో జరిగిన ఘటనలు బాధించాయని పేర్కొన్నారు. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేమని తెలిపారు. అటు తాము కూడా ఆందోళనల నుంచి తప్పుకుంటున్నట్లుగా బీకేయూ (భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్‌ సింగ్‌ ప్రకటించారు. నిన్నటి ట్రాక్టర్ల పరేడ్‌లో చోటుచేసుకున్న ఘటనలు తీవ్రంగా బాధించాయన్నారు.

కాగా మంగళవారం జరిగిన నిరసనలో 300 మంది పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్య తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News