మరబోటులో మంటలు.. కాలిబూడిదైన పడవ
బోటులో ఒక్కసారి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల పడవల్లో ఉన్న జాలర్లు భయాందోళనలకు గురయ్యారు.;
తమిళనాడులోని రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి వద్ద ఓ మరబోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సముద్రం మధ్యలోనే చోటుచేసుకుంది. బోటులో ఒక్కసారి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల పడవల్లో ఉన్న జాలర్లు భయాందోళనలకు గురయ్యారు.
ఇతర పడవలకు మంటలు వ్యాపించకుండా అప్రమత్తమై జాగ్రత్తపడ్డారు. ఇతర బోట్లకు మంటలు వ్యాపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ బోటులో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.