రైతుల సమస్యలను పరిష్కరించాలని సోనూ సూద్..

23 రోజులుగా తీవ్రమైన చలిలో రైతులు కొత్త రైతుల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.;

Update: 2020-12-19 09:07 GMT

లాక్‌డౌన్ సందర్భంగా వందలాది మంది వలస కార్మికులకు సహాయం చేసిన బాలీవుడ్ నటుడు సోను సూద్ దేశ రాజధానిలో జరుగుతున్న రైతు ఉద్యమంపై వ్యాఖ్యానించారు. 23 రోజులుగా తీవ్రమైన చలిలో రైతులు కొత్త రైతుల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల దుస్థితిని చూసి తాను చాలా బాధపడ్డానని నటుడు సోను సూద్ శుక్రవారం అన్నారు.

ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించాలని సత్వరమే పరిష్కరించాలని ఆశిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దులో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా, పంజాబ్‌తో సహా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వేలాది మంది రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరిది సరైనది, ఎవరిది తప్పు అనే చర్చలో పాల్గొనడానికి తాను ఇష్టపడనని, రైతుల సమస్యలు సకాలంలో పరిష్కరించబడాలని తాను కోరుకుంటున్నానని సోనూ సూద్ అన్నారు. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న గందరగోళాన్ని పీఎం తొలగించాలని అన్నారు.

ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని నాకు తెలుసు. నేను పంజాబ్‌లో జన్మించాను. దేశానికి అన్నం పెట్టే రైతన్నను అలా రోడ్డు మీద నిలబెట్టడం భావ్యం కాదని.. మోదీ ప్రభుత్వానికి సోనూ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే పీఎం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..

సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలు వస్తున్నాయని అన్నారు. అంతకుముందు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు రాలేదు. ఇప్పుడు దేశంలోని ప్రతి రైతుకు క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉండేలా నిబంధనలను మార్చాము. రైతులకు అధిక వడ్డీకి రుణాలు తీసుకోకుండా స్వేచ్ఛ లభించింది. దేశంలో బలమైన నిల్వ నెట్‌వర్క్‌ను నిర్మించడమే మా లక్ష్యం అని ప్రధాని రైతులకు చెప్పారు. ఇందుకోసం పరిశ్రమలను కూడా ముందుకు రమ్మని అడుగుతున్నాం అని అన్నారు. 

Tags:    

Similar News