ఆస్పత్రిలో చేరిన నటి.. కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకే పక్షవాతం
డిగ్రీలో నర్సింగ్ చేసిన శిఖ నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు.;
బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా కరోనా నుంచి కోలుకున్నారు. కానీ అకస్మాత్తుగా ఆమెకు పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగాలేదని, శరీరం కుడివైపు పూర్తిగా స్థంభించిపోయిందని ఆమెకు చికిత్స అందిస్తున్న ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. డిగ్రీలో నర్సింగ్ చేసిన శిఖ నటనపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు.
అయితే కరోనా మహమ్మారితో బాధపడుతున్న వారికి తన వంతు సాయం అందించాలని భావించిన ఆమె లాక్‌డౌన్ సమయంలో తిరిగి తన వృత్తిలో జాయినయ్యారు. ముంబైలోని బాలాసాహెబ్ థాకరే కోవిడ్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూ గత ఆరునెలలుగా కరోనా రోగులకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె అక్టోబర్‌లో కరోనా బారిన పడి కోలుకున్నారు.. ఆమె ఆరోగ్యం కుదుట పడిందని అనుకుంటున్న సమయంలో గురువారం పక్షవాతానికి గురయ్యారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కోకిలా బెన్ ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత ఆమెను ముంబైలోని కూపర్ ఆస్పత్రికి పంపించారు.
ఇంతకుముందు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖా, తన 12 సంవత్సరాల వయస్సులో కూడా ఇలాగే పక్షవాతం బారిన పడ్డానని పేర్కొంది. శిఖా సంజయ్ మిశ్రా దర్శకత్వం వహించిన 'కాంచ్లి లైఫ్ ఇన్ ఎ స్లఫ్' లో, షారుఖ్ ఖాన్ నటించిన 'ఫ్యాన్', తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో వచ్చిన 'రన్నింగ్ షాదీ' లో నటించారు.
కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి నటి తిరిగి నర్సుగా మారిన శిఖా మల్హోత్రా.. కత్రినా కైఫ్ ప్రశంసలు అందుకుంది. ఆమె 'రియల్ లైఫ్ హీరో' అని కత్రినా శిఖాను కొనియాడారు.