BS Yediyurappa : కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప మనవరాలు ఆత్మహత్య..!
BS Yediyurappa : బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకుంది.;
BS Yediyurappa : బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మనవరాలు సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు (జనవరి 28 శుక్రవారం) ఉదయం 10 గంటలకి బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకి పాల్పడింది. ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. కాగా సౌందర్యకు రెండేళ్ల క్రితం డాక్టర్ నీరజ్ తో వివాహం జరిగింది. వీరికి నాలుగు నెలల పాప కూడా ఉంది. యడియూరప్ప మొదటి కుమార్తె పద్మ కుమార్తెనే ఈ సౌందర్య. వృతిరిత్యా సౌందర్య డాక్టర్.. ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో ఆమె పనిచేస్తోంది.