బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు రాష్ట్రపతి;
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం చేశారు.
*కరోనా పరిస్థితుల్లో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఎంతో ప్రత్యేకమైనవి- రాష్ట్రపతి
*ఎంత కఠిన పరిస్థితుల్లోనైనా అభివృద్ధి ఆగదు, భారత్ పురోగతి ఆగదు- రాష్ట్రపతి
*దేశంలో కరోనా, కొన్ని రాష్ట్రాలు ప్రకృతి విపత్తులు, బర్డ్ ఫ్లూను భారత్ అధిగమిస్తోంది- రాష్ట్రపతి
*దేశంలోనే అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచారు- రాష్ట్రపతి
*ఈ కరోనా సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సహా ఆరుగురు ఎంపీలు ప్రాణాలు విడిచారు- రాష్ట్రపతి
*సమస్యలు, సవాళ్లను అధిగమిస్తూ ఇండియా దూసుకెళుతోంది- రాష్ట్రపతి
*కరోనా పరిస్థితుల్లో మా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు కాపాడగలిగాం- రాష్ట్రపతి
*ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోంది- రాష్ట్రపతి
*భారత్‌కు ఉన్న టీకా ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచ దేశాలకు అదిస్తున్నాం- రాష్ట్రపతి
*కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతుంది- రాష్ట్రపతి
*పంటలకు కనీస మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడతాయి - రాష్ట్రపతి
*వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అనుమానాలను మా ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నిస్తోంది - రాష్ట్రపతి