Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ప్రధాని మోదీకి, అమిత్‌షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ..
హైదరాబాద్‌లో మరోసారి ప్రధాని మోదీకి, అమిత్‌షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. బైబై మోదీ హ్యాగ్‌ట్యాగ్‌తో బస్టాప్‌ల మీద బ్యానర్లు కనిపించాయి.;
Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి ప్రధాని మోదీకి, అమిత్‌షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. బైబై మోదీ హ్యాగ్‌ట్యాగ్‌తో బస్టాప్‌ల మీద బ్యానర్లు కనిపించాయి. తెలంగాణను చేపగా చూపిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గేలానికి చేప చిక్కినట్టు చూపించిన కార్టూన్లు సిటీలో దర్శనమిస్తున్నాయి. మోదీ, అమిత్‌షాను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది టీఆర్‌ఎస్ పార్టీ పనేనంటూ బీజేపీ ఆరోపిస్తోంది.
హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ మరికొన్ని ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి. గోవా లిబరేషన్ డే సందర్భంగా 300 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం.. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి ఈసారైనా తెలంగాణకు ప్యాకేజీ ఏమైనా తెచ్చారా అని ప్రశిస్తూ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర బ్యానర్లు కట్టారు.
హైదరాబాద్‌లో పెట్టిన ఫ్లెక్సీలలో. వెల్‌కమ్ టు ఫార్టీ పర్సెంట్ సీఎం అనే ఫ్లెక్సీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించే ఫార్టీ పర్సెంట్ సీఎం అంటూ ఫ్లెక్సీ పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అందులోనూ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న తెలంగాణ విమోచన వేడుకలకు వచ్చింది ఒక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. అందుకే, ఫ్లెక్సీలో కనిపిస్తున్న ఫార్టీ పర్సెంట్ సీఎం ఏక్‌నాథ్ షిండేనే అని మాట్లాడుకుంటున్నారు.