By-elections in 13 states: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉపఎన్నికలు..

By-elections in 13 states: కొవిడ్ నేపథ్యంలో పోలింగ్‌కోసం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.;

Update: 2021-10-30 05:16 GMT

By-elections in 13 states: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కొవిడ్ నేపథ్యంలో పోలింగ్‌కోసం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

కేంద్ర పాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాంద్వా లోక్‌ సభ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అసోంలోని 5, పశ్చిమ బెంగాల్‌ 4, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ రాష్ట్రాల్లో 3 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.

బిహార్, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలలో రెండు.. తెలంగాణ, ఏపీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరంలలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి

Tags:    

Similar News