CBN: రెండేళ్లలో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన... అమరావతి నుంచే ప్రపంచానికి కంప్యూటర్లు.. మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమీక్ష

Update: 2026-02-09 09:48 GMT

అభి­వృ­ద్ధి ఫలా­లు చి­వ­రి వ్య­క్తి వరకు చే­రా­ల­న్న­దే ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని ఏపీ ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు మరో­సా­రి స్ప­ష్టం చే­శా­రు. సం­క్షేమ పథ­కా­లు కే­వ­లం కా­గి­తా­ల­కే పరి­మి­తం కా­కుం­డా అట్ట­డు­గు వర్గాల జీవన స్థి­తి­గ­తు­ల్లో మా­ర్పు తీ­సు­కు­రా­వా­ల­ని అధి­కా­రు­ల­కు కఠిన ఆదే­శా­లు జారీ చే­శా­రు. పా­ల­న­లో పా­ర­ద­ర్శ­కత, వేగం, బా­ధ్య­తా­యుత అమలే ప్ర­భు­త్వ ధ్యే­య­మ­ని స్ప­ష్టం చే­శా­రు. సచి­వా­ల­యం­లో ని­ర్వ­హిం­చిన ఉన్నత స్థా­యి సమీ­క్ష సమా­వే­శం­లో మం­త్రు­లు, వి­విధ శాఖల కా­ర్య­ద­ర్శు­లు ప్ర­త్య­క్షం­గా పా­ల్గొ­న­గా… జి­ల్లా కలె­క్ట­ర్లు, ఎస్పీ­లు వర్చు­వ­ల్ వి­ధా­నం­లో సమా­వే­శా­ని­కి హా­జ­ర­య్యా­రు. ఈ సమా­వే­శం­లో రా­ష్ట్ర ఆర్థిక పరి­స్థి­తి నుం­చి భవి­ష్య­త్ వి­జ­న్ వరకు అనేక కీలక అం­శా­ల­పై సీఎం సమ­గ్ర సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు.

రా­ష్ట్ర జీ­ఎ­స్‌­డీ­పీ వృ­ద్ధి­రే­టు, స్వ­ర్ణాం­ధ్ర 2047 వి­జ­న్ లక్ష్యా­లు, పది సూ­త్రాల అమలు పు­రో­గ­తి, ఆదా­యా­ర్జన శాఖల పని­తీ­రు, రా­ష్ట్రా­ని­కి వచ్చిన పె­ట్టు­బ­డు­లు, పీ­పీ­పీ ప్రా­జె­క్టుల పు­రో­గ­తి­పై సీఎం వి­స్తృ­తం­గా సమీ­క్షిం­చా­రు. ప్ర­భు­త్వ ని­ర్ణ­యా­లు ఫలి­తా­లు­గా మా­రు­తు­న్నా­యా లేదా అన్న­దే ప్ర­ధాన ప్ర­మా­ణం­గా తీ­సు­కో­వా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. రి­య­ల్‌­టై­మ్ గవ­ర్నె­న్స్‌­లో భా­గం­గా సాం­కే­తి­కత వి­ని­యో­గం మరింత పెం­చా­ల­ని సూ­చిం­చా­రు. డేటా భద్రత, డేటా లీక్ ని­వా­రణ, పా­ల­న­లో ఏఐ టూ­ల్స్ వి­ని­యో­గం­పై లో­తైన చర్చ జరి­గిం­ది. గతం­లో జి­ల్లా కలె­క్ట­ర్ల సద­స్సు­లు ని­ర్వ­హిం­చే­వా­రు కా­ద­ని, ఇప్పు­డు మూడు నె­ల­ల­కో­సా­రి ని­ర్వ­హి­స్తు­న్నా­మ­ని సీఎం తె­లి­పా­రు. ప్ర­తి నెల రెం­డు­సా­ర్లు మం­త్రి­వ­ర్గ సమా­వే­శా­లు జరు­గు­తు­న్నా­య­ని గు­ర్తు చే­శా­రు. నె­ల­వా­రీ­గా అధి­కా­రు­లు పని­తీ­రు­ను సమీ­క్షిం­చు­కో­వా­ల­ని ఆదే­శిం­చా­రు. జి­ల్లా స్థా­యి­లో కలె­క్ట­ర్లు, ఇన్‌­చా­ర్జ్ మం­త్రు­లు సమ­ర్థం­గా పని­చే­యా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. ని­ర్ణ­యం­పై అధి­కా­రు­లు పట్టు­ద­ల­తో పని చే­యా­ల­ని, పనుల పు­రో­గ­తి­ని క్షే­త్ర­స్థా­యి­లో ఇన్‌­చా­ర్జ్ మం­త్రు­లు పరి­శీ­లిం­చా­ల­ని సీఎం ఆదే­శిం­చా­రు.

 సూపర్ సిక్స్ పథకాల అమలుపై

సూ­ప­ర్ సి­క్స్ పథ­కాల అమ­లు­లో ప్ర­భు­త్వం ఇచ్చిన మాట ని­ల­బె­ట్టు­కుం­ద­ని సీఎం చం­ద్ర­బా­బు అన్నా­రు. ‘తల్లి­కి వం­ద­నం’ పథకం అమ­లు­లో­కి తె­చ్చా­మ­ని, స్త్రీ శక్తి పథకం ద్వా­రా 4.29 కో­ట్ల మంది ఉచిత బస్సు ప్ర­యా­ణా­లు చే­శా­ర­ని తె­లి­పా­రు. అన్న­దాత సు­ఖీ­భవ పథకం ద్వా­రా రూ.6,310 కో­ట్ల­ను రై­తుల ఖా­తా­ల్లో జమ చే­శా­మ­ని చె­ప్పా­రు. దీపం పథకం కింద రెం­డు కో­ట్ల గ్యా­స్ సి­లిం­డ­ర్లు అం­దిం­చా­మ­ని, ఎన్టీ­ఆ­ర్ భరో­సా ద్వా­రా రూ.58,654 కో­ట్ల పె­న్ష­న్లు పం­పి­ణీ చే­శా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. రై­తు­లు, వి­ద్యా­ర్థుల ఆత్మ­హ­త్య­ల­పై ప్ర­త్యే­కం­గా ఆడి­ట్ చే­యా­ల­ని ఆదే­శా­లు ఇచ్చా­మ­ని తె­లి­పా­రు.

Tags:    

Similar News