Cash circulation: మళ్లీ కరెన్సీ విశ్వరూపం.. 83 శాతం నగదు చలామణి

Cash circulation: ఆరేళ్ల తరువాత మళ్లీ కరెన్సీ తన విశ్వరూపాన్ని చూపించింది..83 శాతం నగదు చలామణి పెరిగింది.;

Update: 2023-01-03 11:12 GMT

Cash Circulation: ఆరేళ్ల తరువాత మళ్లీ కరెన్సీ తన విశ్వరూపాన్ని చూపించింది..83 శాతం నగదు చలామణి పెరిగింది. పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాట వేయి, ఐదు వందల నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి.


కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా. నోట్ల రద్దు రోజుతో పోలిస్తే ప్రస్తుతం జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని గణాంకాలు చెబుతున్నాయి.నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు.రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్‌ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి.


మరోవైపు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా 9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ 2022 డిసెంబర్‌ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం ఇచ్చారు. ఆ గడువు లోపల15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది.


మరోవైపు మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్‌ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయని తెలిపింది.

Tags:    

Similar News