టీచర్స్ డే శుభాకాంక్షలు.. సినీతారల ట్వీట్లు..
ఆది గురువు అమ్మే అయినా బడిలో మాస్టారి దగ్గర బోలెడు పాఠాలు నేర్చుకుంటాం..;
ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో విలువైంది. ఆది గురువు అమ్మే అయినా బడిలో మాస్టారు దగ్గర బోలెడు పాఠాలు నేర్చుకుంటాం.. ఎదుగుతున్న క్రమంలో విద్యతో పాటు స్ఫూర్తి దాయకమైన విషయాలెన్నింటినో గురువులు నేర్పిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు తమ జీవితాల్లోని గురువుల పాత్రను గుర్తు చేసుకున్నారు.
* విద్య నేర్పేది గురువై అయినా జీవితం మనకెన్నో పాఠాలు నేర్పుతుంది అని అంటోంది ఘట్టమనేని మంజుల. నవ్వు నుంచి ఏడుపు వరకు అన్నీ నేర్పిస్తుంది. మనం ఊహించని పరిస్థితుల్ని ఎదుర్కునేలా చేస్తుంది అని అంటున్నారు.
* బడిలో పాఠాలు బోధించడం అనేది వృత్తి కాదు.. అది ఒక బాధ్యత. విద్యార్థులకు ఏ అంశంపై ఆసక్తి ఉందో గుర్తించి ఆ మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తారు గురువులు అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
* నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కరోనా సీజన్ లోనూ విద్యార్థులకు అండగా ఉంటూ పాఠాలు చెబుతున్న గురువులకు వందనం.. నా జీవితంలో నాకు స్ఫూర్తిని ఇచ్చిన గురువులకు ఎంతో రుణపడి ఉంటాను అని మహేష్ అంటున్నారు.
* విద్యార్థులకు గురువు ఒక హీరో, ఒక రోల్ మోడల్.. పిల్లల ఆలోచనల్ని, సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ప్రేమను పంచుతున్న ప్రతి ఉపాధ్యాయుడికి నా సెల్యూట్ అని సమంత ట్వీట్ చేశారు.
* మన జీవితాల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు మాత్రమే చెబితే సరిపోదు. లాక్డౌన్ లో నా కుమారుడిని భరించడానికి ఎంతో సహనం కావాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఉపాధ్యాయుల విలువ మరింత బాగా అర్థమైంది. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే అని శిల్పాశెట్టి ట్వీట్ చేశారు.
* మనం ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి భవిష్యత్తు వైపుకు అడుగులు వేయించిన వ్యక్తులు వీరు. అలాంటి అద్భుతమైన గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.