Telangana: తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన
Telangana: సేకరణ ఎంత పెంచాలన్నది దిగుబడి, మిగులు, సాగు తీరు ఆధారంగా నిర్ణయిస్తాం అని కేంద్రం చెప్పింది.
తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. రబీలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనుకున్నప్పటికీ.. టార్గెట్ కంటే ఎక్కువగా 61.87 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పింది. ఖరీఫ్‌లో 40 లక్షల మెట్రిల్ టన్నులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో నిర్ణయించామని.. కాని, పెరిగిన దిగుబడి, మార్కెట్లో మిగులును దృష్టిలో పెట్టుకుని టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యం సేకరించాలని చూస్తున్నామని కేంద్రం సమాధానం ఇచ్చింది. సేకరణ ఎంత పెంచాలన్నది దిగుబడి అంచనాలు, మార్కెట్ మిగులు, సాగు తీరు గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పింది. టీఆర్‌ఎస్ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.