పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం..గానగంధర్వుడుకి పద్మ విభూషణ్
గానగంధర్వుడు దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది సర్కార్.;
ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది సర్కారు. ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'పద్మ' అవార్డుల జాబితాను రిలీజ్ చేసింది.
గానగంధర్వుడు దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది సర్కార్. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి నలుగురిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు ముగ్గురు.. తెలంగాణ నుంచి ఒక్కరు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ :
రామస్వామి అన్నవరపు (కళారంగం)
ప్రకాశ్‌రావు అసవడి (సాహిత్యం, విద్య)
నిడుమోలు సుమతి (కళలు)
తెలంగాణ :
కనకరాజుకు కళా రంగం