గుండెపై కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం: కేంద్రం
కరోనా మొదలైనప్పటి నుంచి ఈ మహమ్మారిపై చాలా అధ్యాయనాలు జరుగుతున్నాయి. చాలా మంది పరిశోధకులు ఈ మహమ్మారి ప్రభావం;
కరోనా మొదలైనప్పటి నుంచి ఈ మహమ్మారిపై చాలా అధ్యాయనాలు జరుగుతున్నాయి. చాలా మంది పరిశోధకులు ఈ మహమ్మారి ప్రభావం శ్వాసకోస వ్యవస్థతో పాటు గుండెపై పడుతుందని చాలా రోజుల నుంచి వాదిస్తున్నారు. అయితే, దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది. కరోనా మహమ్మారి గుండె వంటి కీలక అవయవాలపై కూడా కరోనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే విషయం తమ వద్దకు వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ తెలిపారు. ఈ విషయాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఒకటి అధ్యయనం చేస్తోందని.. ఐసీఎమ్ఆర్ వంటి సంస్థలకు కూడా సూచించామని మంత్రి ప్రకటించారు.