తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్.. థియేటర్లలో ఎక్కువ సీట్ల బుకింగ్!
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసింది కేంద్రం.;
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేసిన కేంద్రం.. ప్రస్తుతం 50శాతం సీటింగ్ సామర్థ్యంతో నడుస్తున్న సినిమా హాళ్లు, థియేటర్లలో ఎక్కువ సీట్ల బుకింగ్‌కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానుండగా ఎన్ని సీట్లకు అనుమతిస్తుందో కేంద్రం త్వరలోనే చెప్పనుంది.
దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేయనుంది. అటు తాజాగా జారీ చేసిన అన్‌లాక్ మార్గదర్శకాల్లో దేశవ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్స్‌ను తెరిచేందుకు అనుమతించింది. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండడంతో లాక్‌డౌన్ నిబంధనలను భారీగా సడలించేందుకు కేంద్రం సన్నద్ధమైంది.