Chandra Babu: డిసెంబర్ 5న ఢిల్లీకి చంద్రబాబు..
Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు... డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు.;
Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు... డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షత జరిగే రాజకీయ పార్టీ అధ్యక్షుల సమావేశానికి హాజరుకానున్నారు. డిసెంబర్ 1 నుంచి.... 2023 నవంబర్ 30 వరకు జీ-20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహించనుంది.
ఈ నేపథ్యంలో.. రాజకీయపార్టీల అధ్యక్షులతో చర్చించనున్నారు ప్రధాని మోదీ. డిసెంబర్ సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సదస్సుకు రావాల్సిందిగా చంద్రబాబుకు..... పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. సమావేశ ప్రాధాన్యతను టీడీపీ అధినేతకు వివరించి హాజరు కావాల్సిందిగా ఫోన్‌లో కోరారు. దీంతో.. డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు.