Char Dham Yatra 2022 : మొదలైన చార్‌ధామ్‌ యాత్ర.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు

Char Dham Yatra 2022 : ఈ రోజు (మే 3) అక్షయ తృతీయ శుభ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్‌ ఆలయాలు తెరుచుకోగా.. చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది.

Update: 2022-05-03 14:45 GMT

Char Dham Yatra 2022 : ఈ రోజు (మే 3) అక్షయ తృతీయ శుభ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ధామ్‌ ఆలయాలు తెరుచుకోగా.. చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈచార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కావడం విశేషం.. ఇక మే 6న కేదార్‌నాథ్, మే 8న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి.. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తులందరికీ ఆహ్లాదకరంగా చార్‌ధామ్‌ యాత్ర జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ సారి చార్‌ధామ్‌ యాత్రకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని ప్రభుత్వం అంచనా వేసింది.. అందుకే భక్తుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసింది. యాత్రికుల సంఖ్యపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించింది. బద్రీనాథ్ వద్ద రోజుకు 15,000 మంది, కేదార్‌నాథ్ వద్ద 12,000, గంగోత్రి వద్ద 7,000, యమునోత్రికి 4,000 మంది యాత్రికులను అనుమతించనున్నారు.. 45 రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది.

ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ప్రతి ఏటా ఏప్రిల్ - మే నెలల్లో తెరిచే ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, మంచు కారణంగా ఈ ఆలయాల ద్వారాలను మూసివేస్తారు.

Tags:    

Similar News