Charanjit Singh Channi : పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌‌ జిత్ సింగ్‌‌ చన్నీ..!

పంజాబ్‌ కొత్త సీఎం ఎంపిక ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్‌ జిత్‌ సింగ్ చన్నీపేరును కాంగ్రెస్‌ ఖరారు చేసింది.

Update: 2021-09-19 12:34 GMT

పంజాబ్‌ కొత్త సీఎం ఎంపిక ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా చరణ్‌ జిత్‌ సింగ్ చన్నీపేరును కాంగ్రెస్‌ ఖరారు చేసింది. ఎస్సీ నేతకు ఈసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు చరణ్‌ జిత్‌ చన్నీ పేరును ట్విట్వర్‌ ద్వారా ఏఐసీసీ పరిశీలకులు హరీష్ రావత్‌ వెల్లడించారు. సుఖ్‌ జిందర్‌ సింగ్‌ రంధావా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం బలంగా హోరెత్తినా, ఆ కాసేపటే కాంగ్రెస్‌ ట్విస్ట్‌ ఇచ్చింది. అనూహ్యంగా చరణ్‌ జిత్‌ సింగ్‌ తెరపైకి వచ్చారు. నిన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామాతో ఖాళీ అయిన పంజాబ్‌ సీఎం కుర్చీని భర్తీ చేయడానికి ఎఐసీసీ భారీ కసరత్తే చేసింది.పంజాబ్‌ కొత్త సీఎం పీఠం కోసం తొలుత మాజీ పిసీసీ అధ్యక్షులు సునీల్‌ జాఖడ్‌, ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌, సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా పేర్లు వినిపించినప్పటికీ.. అదృష్టం చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీనే వరించింది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష భేటీలో ఆయన ఎన్నిక ఇక లాంఛనప్రాయమే. 

Tags:    

Similar News