ఆటోలో తనకు దొరికిన 50 తులాల బంగారు ఆభరణాల బ్యాగును..

ఆటోలో కూర్చున్న దగ్గర నుంచి ఫోన్ మాట్టాడుతూనే ఉన్నాడు. ఇంతలో తన ఇల్లు రావడంతో ఆటో నుంచి లగేజీ దించి ఇంట్లోకి

Update: 2021-01-29 09:16 GMT

Chennai auto driver honesty : నీతి, నిజాయితీ ఇంకా మిగిలే ఉంది అని కొన్ని సంఘటనలు చూస్తే అనిపిస్తుంది. డబ్బు కోసం పక్కవాడిని చంపేసే రోజులు.. కానీ ఓ ఆటో డ్రైవర్ బండి నడిపితే కానీ సంసారం అనే బండి నడవదు. కష్టపడకుండా వచ్చిన డబ్బంటే ఎవరికైనా ఆసక్తే. కానీ అతడు మాత్రం నిజాయితీ తనకు దొరికిన బంగారాన్ని తిరిగి పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.

చెన్నై క్రోమ్‌పేట‌కు చెందిన ఓ వ్యాపార వేత్త లగేజీతో శ్రవణ్ కుమార్ ఆటోలో వెళుతున్నాడు. ఆటోలో కూర్చున్న దగ్గర నుంచి ఫోన్ మాట్టాడుతూనే ఉన్నాడు. ఇంతలో తన ఇల్లు రావడంతో ఆటో నుంచి లగేజీ దించి ఇంట్లోకి వెళ్లి పోయాడు. గురువారం ఉదయం అతడి కూతురి వివాహం ఓ చర్చిలో జరగనుంది. ఇంతలో ఇలా జరిగింది.

ఆటోలోనే బ్యాగు మర్చిపోయుంటానని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈలోపు ఆటో డ్రైవర్ కూడా తన ఆటో ఎక్కిన వ్యక్తి నగల బ్యాగు మర్చిపోయాడంటూ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు బ్యాగు అప్పగించాడు.

పోలీసులు, వ్యాపార వేత్త ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్నారు. శరవణ్ మాట్లాడుతూ.. నేను ఆభరణాల సంచిని చూసి భయపడ్డాను. నా జీవితం ముగిసే వరకు నిజాయితీ నాకు సహాయపడుతుందని నాకు తెలుసు. శరవణన్ లాంటి నిజాయితీ గల వ్యక్తులు ఈ రోజుల్లో అసాధారణమని మరో అధికారి అన్నారు. 

Tags:    

Similar News