నల్సా యాప్‌ను ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ
NV Ramana: పేదలకు ఉచిత న్యాయసాయం అందించే దిశగా సుప్రీంకోర్టు కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది.;
NV Ramana: పేదలకు ఉచిత న్యాయసాయం అందించే దిశగా సుప్రీంకోర్టు కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఢిల్లీలో లీగల్ సర్వీస్ మొబైల్ యాప్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. నల్సా యూనివర్శిటీ రూపొందించిన ఈ నూతన యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ యుయు లలిత కూడా పాల్గొన్నారు. న్యాయ సేవలు నేరుగా మొబైల్ ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ లీగల్ సర్వీస్ మొబైల్ యాప్ ఉపయోగపడతాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. భారతదేశం అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంతో పాటు ఉన్నతమైన న్యాయవ్యవస్థ కలిగి ఉందని చెప్పారు.
పోలీస్‌స్టేషన్‌లలో మానవ హక్కుల ఉల్లంఘన, వేధింపులపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో కస్టోడియల్ టార్చర్ సహా పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ కనెక్టివిటీ లేక న్యాయ సహాయం అందించడంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.