కరోనా ఉధృతిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన..!
. ఢిల్లీలో 24 గంటల్లో 24 వేల కేసులు నమోద కావడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఆక్సిజన్, ఐసియూ బెడ్లు, రెమెడీస్వేర్ ఇంజెక్షన్ల కొరత ఉందని తెలిపారు.;
కరోనా ఉధృతి ఢిల్లీని వణికిస్తోంది. పరిస్థితి చేయి దాటేలా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో 24 గంటల్లో 24 వేల కేసులు నమోద కావడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో ఆక్సిజన్, ఐసియూ బెడ్లు, రెమెడీస్వేర్ ఇంజెక్షన్ల కొరత ఉందని తెలిపారు. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండడంతో హాస్పిటళ్ల సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
హాస్పిటళ్లలో సౌకర్యాలు అడుగంటుతున్నాయని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితి కొనసాగితే హెల్త్ ఎమర్జెన్సీ తప్పదని అన్నారు. ఆరువేల అదనపు బెడ్లు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అరువేల బెడ్లు సమకూర్చుకున్నా అవసరానికి సరిపోవని తెలిపారు. గత నవంబర్‌లో 4100 ఐసీయూ బెడ్లు సమకూర్చిన కేంద్రం.. ఇప్పుడు కేవలం 1800 మాత్రమే అందిస్తోందని కేజ్రీవాల్ అన్నారు.
ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న ఐసీయూ బెడ్ల సౌకర్యాల్ని 50 శాతం పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు.