పంజాబ్‌లో పొలిటికల్ హీట్... కాసేపట్లో సీఎం అమరేందర్‌సింగ్ రాజీనామా?
పంజాబ్‌లో పొలిటికల్ సీన్ హీటెక్కిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం ఉత్కంఠ రేపుతోంది.;
పంజాబ్‌లో పొలిటికల్ సీన్ హీటెక్కిస్తోంది. పంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో సీఎం అమరేందర్‌సింగ్ రాజీనామా సమర్పించనుండటంతో అందరిచూపు పంజాబ్ అధికారపార్టీ రాజకీయల వైపే మళ్లాయి. మరోవైపు సాయంత్రం చంఢీఘర్‌లో సీఎల్పీ సమావేశం కానున్నది. సీఎల్పీ సమావేశానికి హాజరయ్యేందుకు... ఏఐసీసీ పరిశీలకులు అజమ్ మాకెన్, హరీశ్ చౌదరి ఇప్పటికే చంఢీఘర్ చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం తన రాజీనామా కోరటంపై సీఎం అమరేందర్ సింగ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో కొనసాగలేనని అమరేందర్‌సింగ్ చెప్పినట్లు సమాచారం. అటు తన అభిప్రాయాన్ని ఇప్పటికే సోనియాగాంధీకి సైతం అమరేందర్‌సింగ్ నివేదించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సీఎం రాజీనామా కోరటం సాహసోపేతమైన నిర్ణయంగా పంజాబ్ మాజీ సీఎం జక్కర్ వ్యాఖ్యలు సంచలనం రేకిత్తిస్తున్నాయి.