Vaccine: వ్యాక్సిన్ మొదటి డోసు ఒకటి.. రెండోది మరోటి.. వేయించుకోవచ్చా.. అనుమానాలెన్నో..

డాక్టర్ రాసిన కంపెనీ మెడిసిన్ మనం వెళ్లిన మెడికల్ షాపులో ఉండదు.. వాడు మరో కంపెనీది ఏదో ఇస్తానంటాడు.;

Update: 2021-05-22 10:12 GMT

Vaccine: డాక్టర్ రాసిన కంపెనీ మెడిసిన్ మనం వెళ్లిన మెడికల్ షాపులో ఉండదు.. వాడు మరో కంపెనీది ఏదో ఇస్తానంటాడు.. ఉండరా బాబు ఎందుకొచ్చిన గొడవ. ఇంకో షాపులో అడిగి తీసుకుంటాను అని అక్కడి నుంచి మరో షాపుకి వెళ్తాం.

మెడిసిన్ విషయంలోనే అంత కంగారు పడితే మరి వ్యాక్సిన్ విషయంలో ఇంకెంత కంగారు పడాలి. కోవిడ్ ఎక్కడ వచ్చి ఛస్తుందో అని పరుగున వెళ్లి ఉన్న డోసు ఏదో వేయించుకుంటే రెండో సారి అదే వేయించుకుందామని వెళ్తే ఆ కంపెనీ లేదు పొమ్మంటే ఏం చెయ్యాలి.

ఏదో ఒకటి వేయించుకోవచ్చా అనుమానాలెన్నో.. ఇప్పటికి 17.7 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో 3.9 కోట్ల మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.

ప్రధానంగా రెండు వ్యాక్సిన్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. ఒకటి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్, రెండు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్. ఈ రెండింటిలో ఏది మొదటి డోసు వేయించుకుంటే అదే రెండోసారి కూడా వేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం సైంటిస్టులు ఇలా రెండు వ్యాక్సిన్లు వేరు వేరు కంపెనీలవి వేయించుకుంటే అవి ఆ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. ఇలా చేయడంవల్ల శరీరంలో వచ్చే రియాక్షన్లు, రోగనిరోధక వ్యవస్థ స్పందనలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మహారాజ్ గంజ్ కు చెందిన ఉమేష్ అనే వ్యక్తి మొదటిసారి కోవాక్సిన్, రెండో డోసు కోవీషీల్డ్ వేయించుకున్నారట. కానీ అతడికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేవని ఇక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎకే శ్రీవాత్సవ స్పష్టం చేశారు. కానీ సాధ్యమైనంత వరకు మొదటి డోసు ఏది వేయించుకుంటే రెండో డోసు అదే వేయించుకోవడం ఉత్తమం. 

Tags:    

Similar News