కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ఆర్థిక మంత్రి జయశంకర్ పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ... చైనా ఆర్థిక విధానం పెద్దదని, భారత ఆర్థిక విధానం చిన్నదని.. అందువలన చైనాతో భారత్ పోరాడలేదని జైశంకర్ అనడం పిరికిమాటలని అన్నారు రాహుల్.
ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు జైశంకర్. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల మధ్య చైనా భారత్ విధానాలను సమర్థించారు. ఓ ప్రశ్నకు సమాదానం ఇస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ పెద్దదని అన్నారు జైశంకర్. ఆర్థికపరంగా చైనాతో జరుగుతున్న పోరాటంపై తాను ఇప్పుడే స్పందించలేనని అన్నారు. ఈ విషయానని రాహుల్ తప్పుబట్టారు. భారత్ కంటే చైనా గొప్పదన్నట్లు జైశంకర్ మాటలు ఉన్నాయన్నారు రాహుల్. భారత్ కంటే చైనాను ఎక్కువ చేసి చూపడం దేశాన్ని అవమానించడమేనని అన్నారు. చైనా ధనవంతుడని, శక్తివంతుడని భారత విదేశాంగ మంత్రి అనడం షాకింగ్ గా ఉందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్.