Rahul Jodo Yatra: జోడో యాత్ర 8వ రోజు.. శివంగి మఠాన్ని సందర్శించిన రాహుల్

Rahul Jodo Yatra: అన్నీ వర్గాల ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగారు.;

Update: 2022-09-14 06:50 GMT

Rahul Jodo Yatra: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు ఆ పార్టీ భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజు ప్రారంభించారు. యాత్ర ప్రారంభించే ముందు రాహుల్ గాంధీ తిరువనంతపురంలోని శివగిరి మఠాన్ని సందర్శించి ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురుని స్మరించుకున్నారు.

ఉదయం ఆరున్నరకు శివగిరి మఠం స్వామీజీలతో సమావేశం అయ్యారు అనంతరం శివగిరి పీఠాధిపతి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. ఏడు గంటలకు నవామ్కులం జంక్షన్‌ నుంచి పాదయాత్ర మొదలు పెట్టిన రాహుల్‌ గాంధీకి స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది.

11 గంటలకు కొల్లాం లోని చింతన్నూర్‌ వరకు సాగింది.అక్కడ స్థానిక ఎంపైర్‌ కన్వన్షన్‌ సెంటర్‌లో రాహుల్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు.మరి కాసేపట్లో కొల్లాంలో స్కూల్‌ విద్యార్ధులతో ముచ్చటించనున్నారు రాహుల్‌ గాంధీ. తిరిగి సాయంత్రం నాలుగున్నరకు పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. రాత్రి ఏడు గంటల వరకు సాగనున్న ఎనిమిదో రోజు పాదయాత్ర పల్లిముక్కు జంక్షన్‌లో ముగియనుంది. రాత్రికి పల్లిముక్కు లోని యూనిస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో బస చేయనున్నారు రాహుల్‌ గాంధీ.

కేరళలో భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై ఫైర్‌ అయ్యారు. కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు రాహుల్‌ గాంధీ. వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ప్రధాని మోదీ, చైనాకు అప్పగించారంటూ ఆరోపించారు. ఏప్రిల్‌ 2020కి ముందున్న స్టేటస్‌కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని తెలిపారు ఈ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో..కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు అన్నీ వర్గాల ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగారు. ఉదయం శివగిరి మఠం స్వామిజీలతో సమావేశం అయిన రాహుల్‌ అనంతరం ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలను కలిసి ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇక చాలామంది రాహుల్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.పాదయాత్ర విరామ సమయంలోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులు,ఉద్యోగులు రాహుల్‌ను కలసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువస్తున్నారు.

Tags:    

Similar News