ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్ధిగా ప్రియాంక గాంధీ..!
ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతోంది కాంగ్రెస్ పార్టీ.;
ఉత్తరప్రదేశ్ సీఎం అభ్యర్ధిగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతోంది కాంగ్రెస్ పార్టీ. యూపీలో కాంగ్రెస్‌ను ప్రియాంక గాంధీనే నడిపించబోతున్నారంటూ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కామెంట్ చేశారు. ప్రియాంక సారథ్యంలోనే పార్టీ నడుస్తుందని ప్రకటించారు. ఇకపై అంతా తానై వ్యవహరించబోతున్నారని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీచేయబోతోందని ఖుర్షీద్ చెప్పుకొచ్చారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ముందుకొస్తే ఆహ్వానిస్తామని ప్రకటించారు. 2017 యూపీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం ఏడింటిలోనే గెలిచింది. దీంతో మెరుగైన ఫలితాల కోసం ఈసారి ప్రియాంకను రంగంలోకి దించుతున్నారు.
యూపీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం జనంలోనే తిరుగుతోందని, సామాన్యుల కష్టాలను కాంగ్రెస్ వింటోందని చెప్పుకొచ్చారు. సామాన్యుడి గళం ప్రతిధ్వనించేలా ఈసారి తమ మేనిఫెస్టో ఉండబోతోందని ప్రకటించారు. రైతులు, మహిళల రక్షణే అజెండా పార్టీ ప్రచారం ఉండబోతోందని కాంగ్రెస్ చెబుతోంది.