రాష్ట్రంలో కొత్త కరోనా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 58,925 మంది కరోనా టెస్టులు చేయగా 2,239 మందికి పాజిటివ్;

Update: 2020-09-26 04:36 GMT

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 58,925 మంది కరోనా టెస్టులు చేయగా 2,239 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నమోదైర కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే కరోనాతో మృతి చెందిన వారు 11మంది. దీంతో మృతుల సంఖ్య 1,091కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,181 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,52,441కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,683 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 28,00,761కి చేరింది. 

Tags:    

Similar News