6రాష్ట్రాల్లో 87వేలకు పైగా ఆరోగ్యకార్యకర్తలకు కరోనా

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో

Update: 2020-08-29 04:45 GMT

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల కొరత ఏర్పడుతుంది. అటు, అదే సమయంలో చాలా మంది ఆరోగ్యకార్యకర్తలు కరోనా బారినపడటం.. ఉన్న సిబ్బందికి మరింత ఒత్తిడిపెరుగుతుంది. దేశంలోని 6 రాష్ట్రాల్లోనే 87 మందికిపైగా కరోనా బారినపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్‌ల‌లో 87 వేల‌కుపైగా ఆరోగ్య కార్యకర్తలకు కరోనా సోకింది. 573 మందిని ఈ మహమ్మారి మింగేసింది. కర్ణాటకలో12,260 మంది, తమిళనాడులో 11,169 మంది, మహారాష్ట్రలో 24,000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తల‌కు క‌రోనా సోకినట్లు గుర్తించారు. మరోవైపు మహారాష్ట్రలో 292 మంది, కర్ణాటకలో 46 మంది, తమిళనాడులో 49 మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు మృతిచెందారు.  

Tags:    

Similar News