కర్నాటకలో కొత్తగా 9,319 కేసులు

కర్నాటకలో ప్రతీరోజూ నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పదివేలు కేసులు నమోదవుతున్న అతి తక్కువ రాష్ట్రాల

Update: 2020-09-06 14:52 GMT

కర్నాటకలో ప్రతీరోజూ నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పదివేలు కేసులు నమోదవుతున్న అతి తక్కువ రాష్ట్రాల జాబితాలో కర్నాటక కూడా చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,319 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,92,139కు చేరింది. అటు, రోజువారీ మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్కరోజే 95 మంది మృతి చెందగా.. ఇప్పటివరకూ 6,393 కరోనా కాటుకి బలైయ్యారు. అయితే, ఇప్పటివరకూ 2,92,873 మంది కోలుకోగా.. ఇంకా, 99,266 మంది చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News