మహారాష్ట్రను కలవరపెడుతున్న కరోనా.. ఒక్కరోజే 312మంది మృతి
కరోనా మహమ్మారి మహారాష్టను కలవరపెడుతుంది. గతవారం రోజులుగా వరుసగా 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.;
కరోనా మహమ్మారి మహారాష్టను కలవరపెడుతుంది. గతవారం రోజులుగా వరుసగా 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 20,489 కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 8,83,862కు చేరుకుంది. అయితే, అందులో ఇప్పటివరకు 6,36,574 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 2,20,661 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసులు మాత్రమే కాదు మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 312 మంది కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 26,276కి చేరింది.