కరోనా రోగుల ఎదుట డాక్టర్ల డాన్స్.. ఎందుకంటే?
కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న రీతిలో చికిత్సకు శ్రీకారం చుట్టింది.;
కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న రీతిలో చికిత్సకు శ్రీకారం చుట్టింది. వడోదరలోని పారుల్ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు మ్యూజిక్ థెరపీని ప్రారంభించారు వైద్యులు. రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. దీనివల్ల కొవిడ్ గురించి బాధితుల్లో ఉన్న ఆందోళన తగ్గి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. మ్యూజిక్ థెరపీకి రోగులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.