డెల్టా వేరియంట్ పై డేంజరస్ అప్ డేట్...! డబుల్ డోస్‌ తర్వాత వైరస్ సోకడానికి కారణం అదే..!

ICMR: కరోనా రాకుండా టీకా తీసుకున్నా కూడా వైరస్ బారిన పడటం వెనుక కారణమేంటో తెలిసిపోయిందని ఐసిఎంఆర్ చెప్తోంది.;

Update: 2021-07-16 10:23 GMT

Covid Vaccine Representational Imale

Covid Positive After Getting 2 Doses Vaccine: కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ, మరో అప్‌డేట్ జనాలను బెదరగొడుతోంది. ఇప్పటికే నియంత్రణ కోల్పోయిన జనం ఎక్కడిక్కడ గుంపులుగా తిరుగుతుంటే, అసలు కరోనా రాకుండా టీకా తీసుకున్నా సరే వైరస్ వదలదని తేలింది. అదెలానో చూడండి

కరోనా రాకుండా టీకా తీసుకున్నా కూడా వైరస్ బారిన పడటం వెనుక కారణమేంటో తెలిసిపోయిందని ఐసిఎంఆర్ చెప్తోంది. ఇలా కరోనాకి విరుగుడుగా వ్యాక్సిన్ వేయించుకుని కూడా మహమ్మారి బారిన పడినవారిలో 80శాతం మందికి సోకిన స్ట్రెయిన్‌ని పరిశీలించినప్పుడు తేలిందేమిటంటే, అది డెల్టా వేరియంట్. దాదాపు 120 దేశాల్లో ఈ వైరస్ స్ప్రెడ్ అయింది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంత ఉధృతం కావడానికి కూడా ఇదే కారణమంటూ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్- ఐసీఎంఆర్ గతంలోనే ప్రకటించింది. తన వాదనకి మద్దతుగా ఓ సర్వేని చూపింది ICMR. తాము చేసిన సర్వేలో 677మంది పేషెంట్ల వైరస్ శాంపిల్స్ పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పింది.

ఈ సర్వేని విశ్లేషించినప్పుడు తేలుతుంది ఒకటే, వైరస్‌కి కోవాగ్జినో, కోవిషీల్డో, స్పుత్నిక్ వినో ఏదోక టీకా తీసుకున్నాం కదాని ఎలా పడితే అలా తిరిగితే, వైరస్‌ని ఆహ్వానించినట్లే, ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేసినట్లే అని అర్ధమవుతోంది. ఐతే, ఇక టీకాతో పనేంటి, ఎటూ వ్యాక్సిన్ వేయించుకున్నా వైరస్ వస్తుంది కదా, అనే వితండ వాదన వద్దు. ఎందుకంటే, వ్యాక్సినేషన్ జరిగినవారిలో ఓ వేళ వైరస్ సోకినాసరే డెత్ రేటు( మరణాల శాతం) చాలా చాలా తక్కువ. ఇక ఐసిఎంఆర్ చేసిన సర్వేలోని ఇతర అంశాలు చూస్తే, 677మందిలో 71మంది కోవాగ్జిన్ తీసుకున్నవారు కాగా, 604మంది తీసుకున్న టీకా కోవిషీల్డ్ , ఇద్దరు మాత్రం చైనాకి చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్ తీసుకోవడం విశేషం.

ఇక వ్యాక్సిన్ తీసుకుని మరణించినవారి సంఖ్య 3. వీరిలో 482మందికి వైరస్ లక్షణాలు కన్పించగా, వారిలో 69శాతం మందికి జ్వరం,తలనొప్పి,వాంతులు వళ్లు నొప్పులు కన్పించాయ్. 45శాతంమందికి దగ్గు, 22శాతంమందికి వాసన,రుచి కోల్పోయారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తర్వాత ఐసిఎంఆర్ చేసిన మొట్టమొదటి సర్వే ఇది. ఇలా టీకా తీసుకున్నవారికి వైరస్ సోకడానికి డెల్టా, కప్పా వేరియంట్లు కారణమని తేలగా..టీకాలను ఏమార్చగల సామర్ధ్యం వీటికి ఉందని తేలడం ఆందోళన కలిగిస్తోంది.


Tags:    

Similar News