భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను అడ్డుకుంటామని బెదిరించిన ఖలిస్థానీ అనుకూల వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గత వారం భారత్ కు ఆస్ట్రేలియాకు మ్యాచ్ జరిగింది. ఖలిస్థాన్ మద్దతుదారుల నుంచి మ్యాచ్ ను అడ్డుకుంటామని పోలీసులకు బెదిరింపు కాల్ వెళ్లింది. దీంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ నిందితుల ఫోన్ నెంబర్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు సిమ్ బాక్స్ టెక్నాలజీ ఉపమోగించి కాల్ చేసినట్లు గుర్తించారు. సిమ్ బాక్స్ ఉపయోగిస్తే ఒకే నెంబర్ ఒకే సారి వివిధ రాష్ట్రాలలో ఉన్నట్లు చూపిస్తుంది. ఈ టెక్నాలజీని నిందితులు ఉపయోగించారు.
నిందితులను సత్నా, రేవా జిల్లాలకు చెందిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్నప్పుడు బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. సిమ్ బాక్స్ ఉపయోగించడం వలన నిందితుల లొకేషన్లు మధ్య ప్రదేశ్, యూపీ, బీహార్, పంజాబ్ లలో చూపించినట్లు పోలీసులు తెలిపారు.