Dalai Lama Kissing Controversy: సారీ చెప్పిన లామా...

చిన్నారికి, అతడి తల్లిదండ్రులకు సారీ చెప్పినా దలైలామా...;

Update: 2023-04-10 09:58 GMT
మైనర్ బాలుడిని అభ్యంతరకరంగా ముద్దాడిన టిబెట్ ఆధ్యాత్మిక దలైలామా అన్నివైపుల నుంచి వెల్లువెత్తిన విమర్శలకు తలొగ్గారు. చిన్నారికి, అతడి తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే లామా మద్దతుదారులు మాత్రం ఈ ఘటనపై భిన్న వాదనను తెరపైకి తీసుకువచ్చారు. లామా చిన్నారులతో అత్యంత స్నేహపూర్వక అనుబంధాన్ని కలిగి ఉంటారని, ఇందులో భాగంగానే చిన్నారితో సరదాగా  పరాచికాలు ఆడారని చెబుతున్నారు. అంతేకాదు, ఈ విధంగా నాలుక  బయటపెట్టడం టిబెట్ సంప్రదాయంలో భాగమని వెల్లడించారు. 9వ దశాబ్దంలో ఓ టిబెట్ రాజుకు నల్లటి నాలుక ఉండేదని, అయితే ప్రజలందరూ తమకు మామూలు నాలుకలే ఉన్నాయని అతడికి చూపేవారని తెలిపారు. ఏమైనా సంప్రదాయం ఏదైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించనంత వరకూ ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ, ఇలా చిన్నారులపై కూడా పైత్యం ప్రదర్శిస్తేనే అందిరికీ ఒళ్లుమండుతుంది.  
Tags:    

Similar News