ఢిల్లీ భజన్‌పూర్‌లో భవనం కూలిపోవడం కలకలం రేపింది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. హఠాత్తుగా భవనం పడిపోవడంతో అసలేం జరిగిందో అర్థంకాక స్థానికులు వణికిపోతున్నారు. ప్రాణాల్ని కాపాడుకునేందుకు అక్కడ్నుంచి పరుగులు తీశారు. భవనం కూలిన స్థలంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలోని శాస్త్రీ నగర్ లోని భవనం కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం 3.00 ప్రాంతంలో భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు. అయితే కూలిపోతున్న భవనాన్ని కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. భవనం పాతదని అధికారులు తెలిపారు. కూలిపోయే సూచనలు ఉండటంతో, ముందుగానే అందులో నివసించే వారిని వేరేచోటుకి తరలించినట్లు చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుందని ఈఘటనలో ఎవరికీ నష్టం జరుగలేదని తెలిపారు డీసీపీ జాయ్.