Breaking News : ఢిల్లీలో పేలుడు
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.;
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు దాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 కార్లు ధ్వంసమైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఓవైపు విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పేలుడు వెనుక తీవ్రవాద కోణం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాంబ్ స్కాడ్ రంగంలోకి దిగగా, భద్రత కట్టుదిట్టం చేశారు.