సెల్ఫీ మోజు.. నదిలో దిగిన ఏడుగురు యువతులు.. ఒకరు గల్లంతు
మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో సెల్ఫీలు తీసుకుంటున్న ఏడుగురు యువతులు నదిలో మునిగిపోయారు.;
సెల్ఫీ పిచ్చిలో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా ఏ మాత్రం పట్టట్లేదు నేటి యువతకి. మాకేం కాదులే అన్నధోరణిలోనే ఉంటున్నారు. చెరువుల్లో దిగి, కొండ అంచున నిలబడి, ప్రమాదకర ప్రదేశాల్లో ఫోటోలు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో సెల్ఫీలు తీసుకుంటున్న ఏడుగురు యువతులు నదిలో మునిగిపోయారు.
వారిలో ఆరుగురిని సంఘటనా స్థలంలో ఉన్న మత్స్యకారులు, స్థానికులు రక్షించారు. ఒక యువతి మాత్రం కనబడలేదు. వీరంతా బంధువులతో కలిసి పిక్నిక్‌కని వచ్చారు. సరదా కోసం తీసుకున్న సెల్ఫీ ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. దేవాస్‌లోని రాజనాల్ సరస్సు వద్ద ఈ విషాదం జరిగింది.