వైరస్ సీజన్లో ప్రయాణం.. తీసుకోవలసిన జాగ్రత్తలు
కొంత ఆందోళనకు గురి చేస్తున్నా జనం సాధారణ జీవితం గడపడానికే;
కరోనా వైరస్ మహామ్మారి వచ్చి ఏడాది అయినా నీడలా ఇంకా వెంటాడుతూనే ఉంది. మళ్లీ సెకండ్ వేవ్ మొదలైందనే వార్తలు కొంత ఆందోళనకు గురి చేస్తున్నా జనం సాధారణ జీవితం గడపడానికే మొగ్గు చూపుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వారి పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఏదేమైనా, అవసరమైతేనే అడుగు బయటపెట్టమని అధికారులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లవలసి వస్తే సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి వాటికి కచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
వీలైనంతవరకు బస్సు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్‌లను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోండి. ఊరు వెళ్లేముందు శరీర ఉష్ణోగ్రత ఒకసారి చెక్ చేసుకోండి.బస్సు లోపల కూర్చున్నప్పుడు కూడా మాస్క్ ధరించండి. మీ ముక్కును సరిగ్గా కప్పేలా చూసుకోండి. ముఖ్యంగా బస్సులోకి ప్రవేశించే ముందు, దిగే ముందు క్రమం తప్పకుండా చేతులను శుభ్రపరిచేలా చూసుకోండి. ఎక్కువ దూరం ప్రయాణమైనా, దగ్గర ప్రయాణం అయినా వాటర్ బాటిల్ మీ వెంట ఉంచుకోండి. మీకు అనారోగ్యం అనిపించినా లేదా కోవిడ్ లక్షణాలు ఉన్నా ప్రయాణించవద్దు.
మీ ముఖం, ముక్కు మరియు నోటిని తరచుగా తాకవద్దు. బస్సు లోపల ఉన్నప్పుడు అవసరమైతే తప్ప మీ ముసుగు తీయవద్దు. బస్సులోని ఏ వస్తువులను తాకవద్దు. వాడేసిన మాస్కులను, శానిటైజర్లను బస్సులో పడేయవద్దు.