LPG Cylinder: గ్యాస్‌బండలపై ఏబీసీడీలు.. ఏంటి అవి..

LPG Cylinder: సిలిండర్ గడువు ముగిసిన తర్వాత అది ఎప్పుడైనా పేలవచ్చు అని ఆ నెంబర్ సూచిస్తుంది.

Update: 2021-12-30 09:08 GMT

LPG Cylinder: కొన్ని విషయాలు అసలు మనం పట్టించుకోము కానీ అవి ఎంత విలువైన సమాచారాన్ని అందిస్తాయో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి గ్యాస్‌తో పని.. అయితే ఆ సిలిండర్‌పై వేసి ఉన్న నెంబరు ఎందుకు వేస్తారు.. దాని వెనుక కథేంటీ అనే విషయం బహుశా ఎవరికీ తెలయకపోవచ్చు. దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తవానికి గ్యాస్ సిలిండర్‌పై ఉన్న నంబర్ ఆ సిలిండర్ గడువు తేదీ గురించి చెబుతుంది. ఆ సిలిండర్ గడువు ముగిసిన తర్వాత అది ఎప్పుడైనా పేలవచ్చు అని ఆ నెంబర్ సూచిస్తుంది.

సిలిండర్‌ను A,B,C,D అని నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. A అంటే జనవరి నుంచి మార్చి వరకు, B ఏప్రిల్ నుంచి జూన్ వరకు, C జూలై నుండి సెప్టెంబర్ వరకు, D అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సూచిస్తుంది. ఇక ఈ లెటర్స్‌తో పాటు అంకెలు కూడా ఉంటాయి.. అవి సంవత్సరాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు A-27 అంటే మీ సిలిండర్ గడువు జనవరి నుండి మార్చి 2027 వరకు ఉంటుంది. B-22 అంటే ఏప్రిల్ నుంచి జూన్ 2023 వరకు ఉంటుంది.

కాబట్టి మీరు ఈసారి గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు దాని గడువు తేదీని చెక్ చేయడం మర్చిపోవద్దు. గ్యాస్ కంపెనీలు సిలిండర్‌పై నెంబర్ రాయడం ద్వారా తమ విధిని నిర్వహిస్తాయి. గ్యాస్ వినియోగిస్తున్న చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇకపై సిలిండర్ ఇంటికి వస్తే చెక్ చేసుకుని గడువు తీరిన గ్యాస్ బండ వస్తే సమీప గ్యాస్ ఏజెన్సీ దృష్టికి తీసుకువెళ్లండి.

Tags:    

Similar News